Monday, November 24, 2008

సహజ మిత్రులు

ఈ రోజు బాబుగారి ప్రకటన, కా.పా.ఐ తో పొత్తు ప్రకటన చేస్తూ.
ఆ బగవంతుడు మనకి మతిమరుపు ని వరంగా ఇచ్చి బతికించాడు కాని, లేదు అంటే రాష్రాదికారం చేతికి చిక్కాక, బాబు గారు చేసిన పనులు మనకి గుర్తు ఉంటే ఏమి కాను.

కమ్యునిజానికి కాలం చెల్లింది అన్నారు. ఒక్క కమ్యూనిజం ఏమిటీ, అన్ని యిజాలకి కాలం చెల్లింది అన్నారు, ఒక్క టూరిజం తప్ప. (అది నిజమే కామోసు అనుకొని, ఆంద్రా ప్రజలు బాబు గారిని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు, పర్యటనలు చేస్తూ, టూరిజం ని అభివృద్ది చెయ్యమని. అది వేరే విషయం)
అస్సెంబ్లీ లో ప్రతినిదులు లేరు అనే కారణం చూపించి, కా.పా.ఐ ని అఖిలపక్ష సమావేశాలకి పిలవడం ఆపేసారు.
కాల్దరిలో కానీయ్యండి, బషీర్ బాగ్ లో కానీయ్యండి, ఆందోళన చేస్తున్న వారితో చర్చల కంటే, కర్రలకీ, కాల్పులకే పని చెప్పారు.
ప్రపంచ బాంక్ జీతం తీసుకునే వారికంటే ఎక్కువగా వారి సిద్దాంతాలని ప్రవచించారు. (క్షమించాలి, మీకు ఏ సిద్దాంత రాద్దాంతాలు లేవు అని తెలిసినా, ప్రపంచ బాంకు వారు - వారికేవో సిద్దాంతాలు ఉన్నాయి అని చెప్పుకుంటారు కాబట్టి అలా రాయాల్సి వచ్చింది.)

1 comment:

చైసా said...

బాగా చెప్పారు. నాకు ఇంకో అనుమానం...కమ్యునిస్టులకు సిద్దాంతాల పట్ల నిబద్దత ఉన్నాయా అని !