Tuesday, November 29, 2005

ఇలాగైతే కోర్టులు ఎందుకు

ఇలాగైతే కోర్టులు ఎందుకు? - గౌరువెంకట రెడ్డి కేసులో సుప్రీం ప్రశ్న
అందుకే కదండి, కోర్టుల తో పని లేకుండా కొవర్టులతో పని జరిపిస్తున్నాము.

Monday, November 28, 2005

రాజకీయనాయకులకి ఇదే మా అహ్వానం.

అదే మా దేశములో ఐతేనా,

MLA ను చంపినవాడు MLA అవుతాడు.
చంపించినవాడు చీఫ్ మినిష్టర్ అవుతాడు.
గడ్డి తిన్నవాడు కేంద్రమంత్రి అవుతాడు.
బక్కరైతుల పొట్టకొట్టినవాడు, సింగపూర్లో మాల్లు, హోటెల్లు కట్టుకుంటాడు.
రాష్ట్ర CEO గా పచ్చపత్రికలచే కీర్తించబడతాడు.

అదే మీ దేశంలో ఐతే,

ముష్టి ఒక మిలియన్ తిన్న పార్టీ అదికారం వదిలేయాలి.
http://www.cnn.com/2005/WORLD/americas/11/28/canada.government/index.html


మూడు మిలియన్లు తిన్న కాంగ్రెస్ సభ్యుడు రాజీనామా చేయ్యాలి, జైలు కి వెల్లాలి.
http://www.cnn.com/2005/POLITICS/11/28/cunningham/index.html

అలసించిన అశాభంగం. తొందరగ మాదెశమ్ కి మఖాము మర్చండి.

Sunday, November 27, 2005

రెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యింది

రెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యింది. ఎట్టకేలకు మళ్ళీ రాయలి అనె బుద్ది పుట్టినది.
ఎంత తొందరగా రోజులు గడిచిపొతున్నాయి! నిన్న కాక మొన్ననే పోస్ట్ చేసినట్లు ఉంది.

సీను బావ పోలీసులకి చిక్కాడు. ఇకనైనా కుట్ర వెనకాల ఉన్న పెద్ద మనుషుల పేర్లు బయటకి వస్తాయంటారా?అయిన మన అమయాకత్వము కాని, ఎప్పుడన్న పెద్ద తలకాయల పేర్లు బయటకి వచ్చాయా?
మన చట్టం ఎప్పుడు ఉన్నవాడి చుట్టమేగా.