Friday, July 07, 2006

కదంబం

బధ్ఢకం, బధ్ఢకం...బండలా పెరిగి పోయింది. ఆరు నెల్ల తరువాత మోక్షం కింధ పోస్ట్ కి


చాలా రోజులు అయ్యింది "నా గోల" కి వచ్చి...

భొజనప్రియులము కదా, మొదట తిండి గొడవ:

పప్పు దాన్యల ధరలు భారతదేశములో అదుపు చెయ్యడము ఏమో కాని ఇక్కడ అమెరికాలో మాత్రము వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పోని అంత ధర పెట్టి కావలసినన్ని కొనుక్కోవచ్చా అంటీ, ప్రాంతాన్ని బట్టి రకాని కి ఒకటి లేదా రెండు పొట్లాలు మాత్రమే కొనాలి అంటా. అదేమిటండీ అంటే, ఏమి చేస్తాము భారత ప్రభుత్వము పప్పుల ఎగుమతులు నిషేదించింది అంటు ఒక వంకర నవ్వు నవ్వి పోయాడు, కొట్టు పెట్టుకున్న గుజరాతి పటేల్ గారు.
ఇక్కడ పెరిగితే పెరిగాయి కానీ, మన దేశములో కనుక దరలు తగ్గితె అదె పదివేలు.

"లోక్ సత్తా" సత్తా చాటుకోగలుగుతుందా? ఏమో మరి, NTR పార్టీ పెట్టినప్పుడు కూడ ఇలానే అనుకున్నారు కదా, సంవత్సరంలోపె ఇండిరమ్మ పార్టీనిఓడించలేదు. మల్లి అటువంటి అద్భుతమే జరగొచ్చెమొ ముడెల్ల తరువాత, ఎవరు చెప్పొచ్చారు.

Wednesday, March 29, 2006

కదంబం

కింద పోస్ట్ అయితే 10 నెల్లు ఉంది క్యూ లో :)

ఎవడికి పుట్టిన బిడ్డరా..!!
అన్నట్లు ఉంది పోలవరం ముంపు బాదితుల గోడు ఐనా, గంగవరం పోర్టు బాదితుల గోడు ఐనా.తరతరాలు గా అడవిని, సముద్రాన్ని నమ్ముకున్నవారిని ఒక్కసారిగా నాగరిక ప్రపంచంలో బతకమంటే వారి తరమౌతుందా?ఇన్ని చట్టాలు, శాసనాలు ఉండి కూడా వాళ్ళ హక్కులు కాపాడలెనప్పుడు, నాగరిక ప్రపంచములో వాళ్ళ జీవనానికి హామీ ఎవ్వరు?

సోనియమ్మా త్యాగమంటే మీదెనమ్మా...
ఆదెమిటో చిన్నప్పుడు చదువుకున్న కథలో నక్క "అందని ద్రాక్షా పుల్లన" అనుకుంది కానీ, మీలా త్యాగం చెయ్యలేక పోయ్యింది.
ఇంతకీ తేనె తుట్టె ని కదిపింది మీపార్టీవారె కదా, మరి ప్రతిపక్షాల మీద ఆగ్రహం యేల.

హమ్మయ్యా శాసనసభ సమావేశాలు ముగిసాయి.

Tuesday, March 07, 2006

కాశీలో మారణకాండ

కాటికి పోయెలోపు కాశీకి పోయిరావాలి అన్నది, ప్రతి హిందువు కోరిక.
అలాంటి కాశీలో, దైవ దర్శనానికి వచ్చిన అమాయకులని, దైవ సన్నిదిలోనుండే కాటికి పంపించారు.
చేసినది ఎవడైనా కావొచ్చు, కాని దాడి చేసింది మాత్రం హిందువుల నమ్మకం మీద.

పార్లమెంట్ మీద, ఎర్రకోట మీద, అక్శరధామ్ మీద, హైదారాబాదులో, బెంగుళూరులో, ఇలా అక్కడ ఇక్కడ అని లేకుండా ఈ ముష్కరులు దాడులు చేస్తున్నా మనలో చలనం లేదు, రాదు.

తరతరాలుగా బానిసత్వం నరనరానా జీర్నించుకుపోయిన జాతి కదా, సుప్తావస్తలో నుండి లెగవడానికి ఇంకెంత కాలం పడుతుందో.

Monday, February 06, 2006

ఏమి మన పెద్దలు నోరు మెదపరే?

మన దేవతా చిత్రాలు నగ్నంగా చిత్రిస్తే, అది కళ.అదే వారి దేముడి మీద బొమ్మలు గీస్తే ఘోర అపచారం.
అనాడు కావల్సిన స్వేచ్చాస్వాతంత్ర్యాలు, నేడు అవసరం లేవా??

Friday, January 27, 2006

అంతిమ విజయులు ఎవరు?

అంతిమ విజయులు ఎవరు?
హమాస్ విజయం అందరికి అశ్చర్యం కలిగించింది. గెలిచిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి, ఎన్నికలు నిశితముగా పరిశీలించిన వాళ్ళకి, ఏమి సంబందము లేక పోయినా అక్కడ ఏమి జరుగుతుందొ అనే కుతూహలముతో పత్రికలలో వార్తలు చదివే నాలాంటి పాఠకులకి కూడా.

గ్రేటర్ ఇజ్రాయిల్ తమ లక్శ్యంగా గల "లికుడ్" పార్టీ ఇజ్రాయిల్ ని పరిపాలిస్తుండగా, ఇజ్రాయిల్ ఉనికినే గుర్తించని "హమాస్" ని పాలస్తీనియులు ఎన్నుకున్నారు.

అనుకోనివి చాలా జరుగుతూ ఉంటాయి.
అరాఫత్ నాయకత్వం లో ఉన్న ఫతా (అప్పట్లొ పాలస్తీనా విమొచనా దళమ్) ప్రాబల్యం తగ్గించటానికి, ఎనభైలలో హమాస్ ని ప్రోత్సహించెటప్పుడు ఇజ్రాయిల్ నాయకులు ఎప్పుడు అనుకొని ఉండరు, ఏదో ఒక రోజున హమాస్ నాయకులని తామె మట్టుబెట్టల్సి వస్తుంది అని, లేదా ఇప్పుడు ఉన్న పరిస్తితులులాంటివి ఎదొ ఒక రోజు వస్తాయి, ఆ రోజున తామే హమాస్ నాయకులతో చర్చలు జరుపవలసి వస్తుంది అని.

అలానే ఇన్ని రోజులూ పాలస్తీనా పరిపాలన తమ జన్మ హక్కు అనుకుని తోటి పాలస్తీయులు అష్టకష్టాలు పడుతున్నా, విలాసాలలో మునిగి తేలిన ఫతా ఉద్యమ నాయకత్వము కూడా ఎప్పుడూ అనుకొని ఉండదు ఏదొ ఒక రోజు తాము అదికారాన్ని హమస్ నాయకుల కి అప్పచెప్పవలసి వస్తుంది అని.

అదే ప్రజాస్వామ్యపు గొప్పదనం. ప్రజల కోసము పని చెయ్యని రాజకీయ నాయకులని నిర్దాక్షిణ్యముగా అదికారపీఠము నుండి దించగల సౌలభ్యం ఒక్క ప్రజాస్వామ్యములోనే ఉంది.

ఇప్పటికి ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలు తీవ్రవాదాన్ని, హింసావాదాన్ని ఖండించి వాటిని విడనాడె వరకు "హమస్" తో చర్చలు కుదరవు అనవచ్చు. వాళ్ళకి, నేడు కాకపొయినా రేపు ఐనా, ఇజ్రాయిల్ ని గుర్తించని, వాల్ల నాశనమె తమ లక్శ్యం గా గల హమాస్ తో చర్చలు జరపవలసిన పరిస్తితి. ఎందుకంటె "హమాస్" ఈ రోజు ఒక సిరియా నుండో, లేక ఇంకో అరబ్ దేశము నుండో పని చేసె తీవ్రవాద సంస్థ మాత్రమే కాదు, తమని పాలించమని పాలస్తీనా ప్రజలు ఎన్నుకొన్న ఒక రాజకీయ సంస్థ.

ఇన్ని రోజులు ఇజ్రాయిలీలు ఒకె మాట చెప్పె వారు, "లికుడ్" లాంటి అతివాద పార్టీ తమని పరిపాలిస్తున్నా కూడా., తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రక్క అరబ్ దేశములలో వలే రాచరికమో, నియంత్రుత్వ పరిపాలనో కాదు అని. ఇప్పుడు పాలస్తీనియులు కూడా అదే చెప్పవచ్చు, "హమాస్" లాంటి అతివాద భావాలు కల ఒక రాజకీయ పార్టీని ఎన్నుకొని.కాకపోతే ఒక్కటే తేడా, ఇజ్రాయిల్ లోని అతివాద వర్గాలు "లికుడ్" పార్టీ చత్రం కిందకి వచ్చాక ఎన్నడు కూడా హింసావాదాన్ని స్వంతంగా ఆచరించలేదు. ఇజ్రాయిల్ సైన్యం సహాయంతో తమకు కావలసినది సాదించుకునేవారు.

హమాస్ పరిస్తితి అది కాదు. నేటి కి కూడా వారు సొంత మిలిటెంట్ సంస్థలని నిర్వహిస్తున్న పరిస్థితి.ఎన్నికలలో గెలిచిన తరువాత, వాళ్ళ మాటల్లో కొంత మార్పు వచ్చింది. మిగతా దేశాల వారికి వినసొంపుగా రెండు మాటలు చెప్పారు.
1). కాల్పుల విరమణ కొనసాగుతుంది.
2). ఇజ్రాయిల్ అనే దేశము భౌతికముగా ఉండడము మాకు ఇష్టము లేక పోయినా, వాళ్ళ వాస్తవ ఇబ్బండులు తెలియని వారము కాదు అని.
కాక పోతే, అదె నోటితో "palastaine unified army" ని స్తాపించటం గురించి కూడా చెప్పారు. వీళ్ళు మారరు :)

ఇటువంటి పరిస్తితే మన కాశ్మీర్ లో వస్తే...ఒక ఉగ్రవాద సంస్థ ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే, మన ప్రభుత్వము వాళ్ళతో ఎలా వ్యవహరిస్తుందో కదా. ఎన్నికల కోసము హింసని విడనాడి, గెలిచాక మా ముక్క మేముపట్టుకు పోతాము అంటే మన కేంద్రప్రభుత్వముకి ఇబ్బందే.
ప్రజస్వామ్యములో ప్రజలే అంతిమనిర్నేతలు కనుక వారు ఎన్నుకున్న ప్రతినిదుల మాట కి విలువ ఎక్కువ కదా.

పెద్దలూ ఆలోచించండి.

Wednesday, January 25, 2006

ఇక గవర్నమెంట్ తో పని ఏమిటి?

హెల్మెట్ల గురించి హై కోర్టు తీర్పు ఇచ్చేవరకు కదలం.

ఫుట్ పాత్ ఆక్రమనల గురించి, అక్రమ నిర్మాణాల గురించి , పల్లెల లో వైద్యుల గురించి కూడా అదే వరస !

ఇక ఎన్నికలు రద్దు చేసి, జడ్జి లకి పరిపాలన అప్పగిస్తే పోతుంది।కొంచెం వాల్లు ఐనా సామాన్యుని మొర ఆలకిస్థున్నారు।