Thursday, November 20, 2008

సాక్షి రామాయణం

రామోజీ రావు గారికి ఎందుకో మనమీద కోపంగా ఉన్నట్లు ఉంది. లేదు అంటే రాత, కోత, కూత, గీత అన్నీ వొంటి చేత్తో చేసే సుమన్ లాంటి యోగ్యుడైన కొడుకుని దూరం చేసుకుంటారా. దేముని దయవల్ల ఇంత మంది నటులు రోడ్ల మీదకి వచ్చారు కాని, లేకపోతె ఆంద్రరాష్ట్రం అల్లకల్లోలం అయిపొయి ఉండేది కదా తమ ఆరాద్యనటుడు బుల్లితెర మీద కనపడకపోయే సరికి.

వెటకారం పక్కన పెడితే, ఏదొ చిన్న పిల్లల కు ఆటబొమ్మ ఇచ్చినట్లు, రామోజీగారు ఈ.టి.వి. ని సుమన్ కి ఇచ్చారు, నా జోలికి రాకుండా దాన్ని పెట్టుకొని ఆడుకో పో అని. కోతి కి కొబ్బరి కాయ దొరికినట్లు, చానల్ తమ చేతిలో ఉండే సరికి, తమ వెటకారపు రాతలతో, వికృత చేష్టలతో జనాలతో ఆడుకున్నారు ఈ మిత్రద్వయం.
సుమన్ ఆరోగ్యం సరిగా లేదు అనే ఒక్క కారణం తో ఇక్కడి తో ముగిస్తా.
చివరిగా ఒక ప్రశ్న - రామోజీ అనే మర్రిచెట్టు లేక పోతే, సుమన్ అనే మహా కళాకారుడుఎక్కడ ఉండేవాడు?

9 comments:

aswin budaraju said...

లేవంగానే అదే చదివా కానీ సుమన్‌ మాత్రం అలా సాక్షి కి ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండవలసింది

శ్రీనివాస్ పప్పు said...

అంటే రామోజీ మన అయుస్షు పెంచేసాడా.నిజ్జంగా??? బతికించేసాడా

bujji said...

"రాత, కోత, కూత, గీత" హైలైట్.. 'రోత' ని వదిలేసారేంటి మరి?

సుజాత said...

అసలు "నేను కళాకారుడిని" అనే చిత్త భ్రమ నుంచి ఏ దేవుడైనా సుమన్ ని కాపాడితే బాగుండు. మనల్ని కూడా కాపాడిన వాడవుతాడు ఆ దేవుడు.

లలిత said...

బావుంది మీగోడు
అనారోగ్యం అని తెల్సినప్పటినుండీ నాకు సుమన్ మీద తెగ జాలేస్తుంది .తిట్టలంటే మనసురావడంలేదు

krishna rao jallipalli said...

కానివ్వండి... ఉండవల్లికి ఇదొక మేత కొన్ని రోజుల వరకు. గాసు ఏజెన్సి యవ్వారం అందరు మర్చి పోతారు ఈ దెబ్బతో. ఎంతైనా ఉండవల్లి అదృష్టవంతుడు.

ఏడుకొండలు said...

@ అశ్విన్ - ఇస్తే ఇచ్చాడు. పక్కన అ జంటగాడు ఎందుకు అంట.
@శ్రీనివాస్ పప్పు - మన కోసం కన్నబిడ్డని కూడా దూరం చేసుకున్నారు. తరువాయి ముఖ్యమంత్రిగా రామోజీ గారికే నా వోటు.
@ బుజ్జి - అది బోనస్. ఏదొ సుమన్ గారు ప్రాసకి ప్రాణమిస్తారు అని, అలా రాశా :)
@ సుజాత - అల్రెడీ రామోజీగారు మనల్ని కాపాడారు, ఇద్దర్నీ బయటకి పంపించి.
@లలిత - నాకు కూడ అందుకే, అర్దాంతరం గా ముగించా
@ క్రృష్ణారావు - వీళ్ళు చేసే పనులు వాళ్ళకి మేత, వాళ్ళు చేసె పనులు వీళ్ళకి మేతా. పశువుల్లా వీళ్ళు మేయడమే కాని సామాన్య జనఘోష పట్టించుకునెది ఏది?

బాటసారి said...

ఇంతకీ సాక్షి కి ఏమి ఒరిగింది? నేను సరస్వతి కుమారుడుని, కళాకారుడుని అని సుమన్ చెప్పుకుంటున్నప్పుడల్లా నాకైతే నవ్వొచ్చింది...

జగన్ ఎర్రోడు అనుకున్నాను కానీ, ఇంత ఎర్రోడు అని ఇది చదివిన తరవాతే తెలిసింది... :-)

రామోజి ని టార్గెట్ చేద్దామని ప్రయత్నించి, రామోజి కి మంచే చెయ్యడమే కాకుండా జగన్ తనకి, తన తండ్రికి ఉన్న పేరు(??)ని మరింత దిగజార్చుకున్నాడు... దీని ద్వారా రామోజి మంచి పనే చేసాడు అని సాక్షి చదివిన, ఈ టివి ని చూసిన అందరికీ అనిపిస్తుంది...

Manohar said...

దీని వల్ల సాక్షికి , ఈనాడు కి ఏం మేలు జరిగిందో కాని మనకు మాత్రం మేలే జరిగింది.