Tuesday, July 26, 2005

భారతదేశములో బానిసత్వము

చాలా చోట్ల చదివాను, ప్రపంచము లో అన్ని చోట్ల బానిసత్వము ఏదో ఒకరూపమ్ లొ ఉండింది కాని, ఒక్క భారతదేశములోనే అసలు ఎప్పుడూ లేదు అని.
కానీ అలోచిస్తే, హరిశ్చంద్రుడు కాటికాపరి అయినది బానిసగ అమ్ముడుపోయకనే కద.
సత్యయుగము వరకు ఎందుకు, కలియుగములో కూడా మొన్నటి వరకు చాలా ప్రాంతములలో వెట్టి ఉన్నది కదా? వెట్టి - బానిసత్వము కు మరో పేరు మాత్రమే అనవచ్చును కదా?
కానీ మన దేశములో బానిసత్వానికి ఇతర దేశములలో బానిసత్వముకు తేడా, ప్రపంచములో ఎక్కడా స్వజాతి జనులను బానిసలుగా చెసుకోలేదు మనము తప్ప.

ఇది అబద్దము అని చెప్పె reference దొరికితే బాగుండును.

అప్పుడు మనము నిజముగానే సగర్వముగ తల ఎత్తికొని ప్రపంచానికి చాట వచ్చు, "మా గడ్డ మీద బానిసలు ఎప్పుడు లేరు" అని.

1 comment:

tankman said...

meeku reference dorikite naku kooda pampandi.... nenu kooda anadistanu india lo slaves eppudu lerani..(harishchandrudu tappa)