Wednesday, March 29, 2006

కదంబం

కింద పోస్ట్ అయితే 10 నెల్లు ఉంది క్యూ లో :)

ఎవడికి పుట్టిన బిడ్డరా..!!
అన్నట్లు ఉంది పోలవరం ముంపు బాదితుల గోడు ఐనా, గంగవరం పోర్టు బాదితుల గోడు ఐనా.తరతరాలు గా అడవిని, సముద్రాన్ని నమ్ముకున్నవారిని ఒక్కసారిగా నాగరిక ప్రపంచంలో బతకమంటే వారి తరమౌతుందా?ఇన్ని చట్టాలు, శాసనాలు ఉండి కూడా వాళ్ళ హక్కులు కాపాడలెనప్పుడు, నాగరిక ప్రపంచములో వాళ్ళ జీవనానికి హామీ ఎవ్వరు?

సోనియమ్మా త్యాగమంటే మీదెనమ్మా...
ఆదెమిటో చిన్నప్పుడు చదువుకున్న కథలో నక్క "అందని ద్రాక్షా పుల్లన" అనుకుంది కానీ, మీలా త్యాగం చెయ్యలేక పోయ్యింది.
ఇంతకీ తేనె తుట్టె ని కదిపింది మీపార్టీవారె కదా, మరి ప్రతిపక్షాల మీద ఆగ్రహం యేల.

హమ్మయ్యా శాసనసభ సమావేశాలు ముగిసాయి.

Tuesday, March 07, 2006

కాశీలో మారణకాండ

కాటికి పోయెలోపు కాశీకి పోయిరావాలి అన్నది, ప్రతి హిందువు కోరిక.
అలాంటి కాశీలో, దైవ దర్శనానికి వచ్చిన అమాయకులని, దైవ సన్నిదిలోనుండే కాటికి పంపించారు.
చేసినది ఎవడైనా కావొచ్చు, కాని దాడి చేసింది మాత్రం హిందువుల నమ్మకం మీద.

పార్లమెంట్ మీద, ఎర్రకోట మీద, అక్శరధామ్ మీద, హైదారాబాదులో, బెంగుళూరులో, ఇలా అక్కడ ఇక్కడ అని లేకుండా ఈ ముష్కరులు దాడులు చేస్తున్నా మనలో చలనం లేదు, రాదు.

తరతరాలుగా బానిసత్వం నరనరానా జీర్నించుకుపోయిన జాతి కదా, సుప్తావస్తలో నుండి లెగవడానికి ఇంకెంత కాలం పడుతుందో.