నా చిన్నతనములో, వాన వస్తే పండుగే. అది కూడ ప్రొద్దున ఏడు నుండి పది లోపు మాత్రమేకురిస్తే ఇంకా చాలా పండుగ. ఇక ఆ రోజుకి బడి కి డుమ్మానె. తల తడిస్తే ఎక్కడ జలుబు చేస్తుందో అనుకునే పిచ్చి అమ్మ. చిన్నోడు మనేస్తే మనము కూడ డుమ్మాకొట్టవచ్చు అనుకునే నా బాల్యశత్రువు అన్న.
రెండవ తరగతిలో ఉండగా స్కూల్ బస్ ఉండేడి.వానొచ్చినా, వరదొచ్చినా స్కూలు బస్ ఠంచనుగా ఎనిమిందింటికి తయారు. డ్రైవర్ రాక్షసుడికి తోడు, పిల్లరాక్షసుడు రూపములో హెల్పర్.ఇంటి గుమ్మము దక గొడుగు వెసుకొనివచ్చిమరీ తీసుకుపొయేవాడు.
అప్పటివరకు స్కూల్ కి వద్దులే అనే అమ్మ కూడ, మనోడు గొడుగు వెసుకొని రాగనే చిన్నపిల్లోడు వానా వచ్చింది ఇంటి దగ్గరే ఉండి ఆడుకంటాడు అని లేకుండా, ఆ రాక్షసుల కి ఒప్పచెప్పేది.
కాలము ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మనకి కూడ మంచి రోజులు వచ్చాయి, మా స్కూలు వళ్ళు బుస్ రూటు మర్చారు (లేదా మొత్తానికే తీసివేసారు). ఒక మన చడువు వానాకాలము చదువే. వానపడితే చాలు, పుస్తకాలు ముందు వేసుకొని పక్కింటోడి (మరి మన శత్రువులు కొంతమన్ది ఉండేది అక్కడే కద) టాపు ఎగిరిపొయెటట్టు ఎదో ఒకటి చదవడమ్. అమ్మేమో పెద్దోడా నూవు ఒక్కడివే వెల్లులే, చిన్నోడు ఇంటి డగ్గర చడువుకొంటాడు అనడమ్.పెద్దోడెమొ ఎందుకులే అమ్మా బడి మానిపించడము, నేను గొడుగులో తడవకుండా తీసుకువెల్తాగ అనడమ్, ఒకదాని తరువాఅత ఒకటి అలా జరిగిపోతుఉండేవి. పెద్దపూలికేమో ఇవేవి పట్టేవి కావు. ఎదో ఒక గొడవా, పంచాయితి. మద్యలో మనతో మాట్లాడడానికి ఒక నిమిషము దొరికిందా అదృష్టవంతులము. ఆయనకి ఏటూ చదువుల మీద పెద్ద పట్టింపు లేదు కాబట్టి, "నాన్న గారు వాన" అని మనము అనడం ఆలశ్యము, అమ్మాయి అంటు కేక వేసి అమ్మ కి అర్డర్ "వాన పడుతుంది, చిన్నవాడికి స్కూలు ఉండదులే". ఇక దానికి తిరుగులేదు.
మరు నిమిషములో ఎండ వచ్చినా, పెద్దపులిని కాదనే దైర్యము ఎవరికి ఉంది. అప్పటికి ఇంకా మా ఇంట్లో ప్రజాస్వామ్యపు వాసనలు లేవు, నియంతృత్వమే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment