Tuesday, March 07, 2006

కాశీలో మారణకాండ

కాటికి పోయెలోపు కాశీకి పోయిరావాలి అన్నది, ప్రతి హిందువు కోరిక.
అలాంటి కాశీలో, దైవ దర్శనానికి వచ్చిన అమాయకులని, దైవ సన్నిదిలోనుండే కాటికి పంపించారు.
చేసినది ఎవడైనా కావొచ్చు, కాని దాడి చేసింది మాత్రం హిందువుల నమ్మకం మీద.

పార్లమెంట్ మీద, ఎర్రకోట మీద, అక్శరధామ్ మీద, హైదారాబాదులో, బెంగుళూరులో, ఇలా అక్కడ ఇక్కడ అని లేకుండా ఈ ముష్కరులు దాడులు చేస్తున్నా మనలో చలనం లేదు, రాదు.

తరతరాలుగా బానిసత్వం నరనరానా జీర్నించుకుపోయిన జాతి కదా, సుప్తావస్తలో నుండి లెగవడానికి ఇంకెంత కాలం పడుతుందో.

Monday, February 06, 2006

ఏమి మన పెద్దలు నోరు మెదపరే?

మన దేవతా చిత్రాలు నగ్నంగా చిత్రిస్తే, అది కళ.అదే వారి దేముడి మీద బొమ్మలు గీస్తే ఘోర అపచారం.
అనాడు కావల్సిన స్వేచ్చాస్వాతంత్ర్యాలు, నేడు అవసరం లేవా??

Friday, January 27, 2006

అంతిమ విజయులు ఎవరు?

అంతిమ విజయులు ఎవరు?
హమాస్ విజయం అందరికి అశ్చర్యం కలిగించింది. గెలిచిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి, ఎన్నికలు నిశితముగా పరిశీలించిన వాళ్ళకి, ఏమి సంబందము లేక పోయినా అక్కడ ఏమి జరుగుతుందొ అనే కుతూహలముతో పత్రికలలో వార్తలు చదివే నాలాంటి పాఠకులకి కూడా.

గ్రేటర్ ఇజ్రాయిల్ తమ లక్శ్యంగా గల "లికుడ్" పార్టీ ఇజ్రాయిల్ ని పరిపాలిస్తుండగా, ఇజ్రాయిల్ ఉనికినే గుర్తించని "హమాస్" ని పాలస్తీనియులు ఎన్నుకున్నారు.

అనుకోనివి చాలా జరుగుతూ ఉంటాయి.
అరాఫత్ నాయకత్వం లో ఉన్న ఫతా (అప్పట్లొ పాలస్తీనా విమొచనా దళమ్) ప్రాబల్యం తగ్గించటానికి, ఎనభైలలో హమాస్ ని ప్రోత్సహించెటప్పుడు ఇజ్రాయిల్ నాయకులు ఎప్పుడు అనుకొని ఉండరు, ఏదో ఒక రోజున హమాస్ నాయకులని తామె మట్టుబెట్టల్సి వస్తుంది అని, లేదా ఇప్పుడు ఉన్న పరిస్తితులులాంటివి ఎదొ ఒక రోజు వస్తాయి, ఆ రోజున తామే హమాస్ నాయకులతో చర్చలు జరుపవలసి వస్తుంది అని.

అలానే ఇన్ని రోజులూ పాలస్తీనా పరిపాలన తమ జన్మ హక్కు అనుకుని తోటి పాలస్తీయులు అష్టకష్టాలు పడుతున్నా, విలాసాలలో మునిగి తేలిన ఫతా ఉద్యమ నాయకత్వము కూడా ఎప్పుడూ అనుకొని ఉండదు ఏదొ ఒక రోజు తాము అదికారాన్ని హమస్ నాయకుల కి అప్పచెప్పవలసి వస్తుంది అని.

అదే ప్రజాస్వామ్యపు గొప్పదనం. ప్రజల కోసము పని చెయ్యని రాజకీయ నాయకులని నిర్దాక్షిణ్యముగా అదికారపీఠము నుండి దించగల సౌలభ్యం ఒక్క ప్రజాస్వామ్యములోనే ఉంది.

ఇప్పటికి ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలు తీవ్రవాదాన్ని, హింసావాదాన్ని ఖండించి వాటిని విడనాడె వరకు "హమస్" తో చర్చలు కుదరవు అనవచ్చు. వాళ్ళకి, నేడు కాకపొయినా రేపు ఐనా, ఇజ్రాయిల్ ని గుర్తించని, వాల్ల నాశనమె తమ లక్శ్యం గా గల హమాస్ తో చర్చలు జరపవలసిన పరిస్తితి. ఎందుకంటె "హమాస్" ఈ రోజు ఒక సిరియా నుండో, లేక ఇంకో అరబ్ దేశము నుండో పని చేసె తీవ్రవాద సంస్థ మాత్రమే కాదు, తమని పాలించమని పాలస్తీనా ప్రజలు ఎన్నుకొన్న ఒక రాజకీయ సంస్థ.

ఇన్ని రోజులు ఇజ్రాయిలీలు ఒకె మాట చెప్పె వారు, "లికుడ్" లాంటి అతివాద పార్టీ తమని పరిపాలిస్తున్నా కూడా., తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, ప్రక్క అరబ్ దేశములలో వలే రాచరికమో, నియంత్రుత్వ పరిపాలనో కాదు అని. ఇప్పుడు పాలస్తీనియులు కూడా అదే చెప్పవచ్చు, "హమాస్" లాంటి అతివాద భావాలు కల ఒక రాజకీయ పార్టీని ఎన్నుకొని.కాకపోతే ఒక్కటే తేడా, ఇజ్రాయిల్ లోని అతివాద వర్గాలు "లికుడ్" పార్టీ చత్రం కిందకి వచ్చాక ఎన్నడు కూడా హింసావాదాన్ని స్వంతంగా ఆచరించలేదు. ఇజ్రాయిల్ సైన్యం సహాయంతో తమకు కావలసినది సాదించుకునేవారు.

హమాస్ పరిస్తితి అది కాదు. నేటి కి కూడా వారు సొంత మిలిటెంట్ సంస్థలని నిర్వహిస్తున్న పరిస్థితి.ఎన్నికలలో గెలిచిన తరువాత, వాళ్ళ మాటల్లో కొంత మార్పు వచ్చింది. మిగతా దేశాల వారికి వినసొంపుగా రెండు మాటలు చెప్పారు.
1). కాల్పుల విరమణ కొనసాగుతుంది.
2). ఇజ్రాయిల్ అనే దేశము భౌతికముగా ఉండడము మాకు ఇష్టము లేక పోయినా, వాళ్ళ వాస్తవ ఇబ్బండులు తెలియని వారము కాదు అని.
కాక పోతే, అదె నోటితో "palastaine unified army" ని స్తాపించటం గురించి కూడా చెప్పారు. వీళ్ళు మారరు :)

ఇటువంటి పరిస్తితే మన కాశ్మీర్ లో వస్తే...ఒక ఉగ్రవాద సంస్థ ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే, మన ప్రభుత్వము వాళ్ళతో ఎలా వ్యవహరిస్తుందో కదా. ఎన్నికల కోసము హింసని విడనాడి, గెలిచాక మా ముక్క మేముపట్టుకు పోతాము అంటే మన కేంద్రప్రభుత్వముకి ఇబ్బందే.
ప్రజస్వామ్యములో ప్రజలే అంతిమనిర్నేతలు కనుక వారు ఎన్నుకున్న ప్రతినిదుల మాట కి విలువ ఎక్కువ కదా.

పెద్దలూ ఆలోచించండి.

Wednesday, January 25, 2006

ఇక గవర్నమెంట్ తో పని ఏమిటి?

హెల్మెట్ల గురించి హై కోర్టు తీర్పు ఇచ్చేవరకు కదలం.

ఫుట్ పాత్ ఆక్రమనల గురించి, అక్రమ నిర్మాణాల గురించి , పల్లెల లో వైద్యుల గురించి కూడా అదే వరస !

ఇక ఎన్నికలు రద్దు చేసి, జడ్జి లకి పరిపాలన అప్పగిస్తే పోతుంది।కొంచెం వాల్లు ఐనా సామాన్యుని మొర ఆలకిస్థున్నారు।

Thursday, December 22, 2005

రిజర్వేషన్స్ ఎవరికి అవసరం??

తరతరాలుగా బానిసలుగా బతికిన దళితులకా? లేక..వొద్దురా బాబు అంటున్నా వినకుండా పంది పిల్లలని కన్నట్టు కని, ప్రపంచమ్ మీద కి వదిలే మూర్ఖ జాతికా??
ఏమి అన్యాయము జరిగింది అని వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలి?
ఆంగ్లేయులు వచ్చువరకు, మనని పాలించిన వారి వారసులే కద వీరు?
ఏడవ శతాబ్దము నుండి భారత జాతి సంస్కృతిని నాశనం చేసి, సంపదను కొల్లగొట్టి, మన స్త్రీల మాన,ప్రాణములను హరించి వేసిన ముష్కర మూకల వారసులము అని నిస్సిగ్గుగా చెప్పుకునే వారికి ఇటువంటి తాయిలాలు ఇవ్వనవసరమా?


రాజశేఖరా, కళ్ళు తెరువు.
వోటు బాంకు, వరల్డ్ బాంకు అనకుండా, ఏదో మేలు చేస్తావు అని నిన్ను గెలిపించారు. వాళ్ళ అశలు అడియాసలు కానివ్వమాక. చరిత్రలో మచ్చగా మిగలమాక.

ఏమి జరుగుతుంది.

మతం మౌడ్యం తలకెక్కిన అత్మాహుతి దళసభ్యుడు నగరం నడిబొడ్డున ఉన్న టాస్క్-ఫోర్స్ ఆఫీస్ మీద దాడి చేస్తే నేటి వరకు నిజాలు బయటకి రావడమ్ లేదు. మన పచ్చపత్రికలకేమొ ఫాక్షన్ గొడవల మీద ఉన్న శ్రద్ద ఇటువంటి కేసు మీద లేక పోయె.

మొన్న శాసనసభలో అన్న చర్చకు వస్తుంది ఏమొ అనుకుంటే, రకరకాల కారణాల వల్ల అది కూడా జరగలేదు.
జగన్ సెక్యూరిటీ గార్డ్ అత్మహత్యా ప్రయత్నానికి ఉన్నటువంటి విలువ దీనికి లేక పొయే.

నిజ్జంగా మన పోలీసుబాబులు చెప్పినట్లు చంపడమే లక్ష్యం ఐతే, పండగ ముందు రోజు దాడి ఎందుకు చేస్తారు?
అట్లాకాక వాళ్ళ లక్ష్యం, పోలీసులకి హెచ్చరిక పంపడమా?లేక పోలీసుల దగ్గర ఉన్న ఆదారాలు నాశనం చెయ్యడమా?
ఇక్కడ మనం గుర్తుంచుకోవల్సింది, మన పోలీసులు దాడి జరక ముందు కొంతకాలం గా వీళ్ళ కార్యక్రమాల మీద చాలానే ఆదారాలు సంపాదించారు. వాటిని నాశనం చెసె లక్ష్యం గా దాడి జరిగి ఉంటె, ఆ ముష్కరులు తమ పనిలో చాల వరకు విజయం సాదించారు.

Sunday, December 18, 2005

హే రామ్ !

http://news.bbc.co.uk/2/hi/south_asia/4539192.stm

ఎంత ఘోరం, ఎంత అన్యాయం.
మన దున్నపోతు అదికార గణం నిర్లక్షమ్ వలన నలుబది రెండు ప్రాణములు గాలిలో కలిసిపోయినవి కదా.
ఇంత నిర్లక్షముగా వ్యవహరించిన అదికారులకి ఏ శిక్ష సరైనది?
మొన్న నవంబరులోనే కదా అరుగురు మృతి చెందారు. ఇప్పడు ఐనా జాగ్రత్త పడవలసిన బాద్యత లేదా?

Sunday, December 04, 2005

లాల్ సలామ్ చెన్నమనేని గారు...

స్వర్ణోత్సవ వేల నిజామ్ రాక్షసుని పొగడ్తా ??? సిగ్గు సిగ్గు

ఒవైసీ... చరిత్ర కి నీ సొంత భాష్యాలు చెప్పకు.ఇంకా తెలంగాణా పోరాట యోధులు బతికే ఉన్నారు . తెలంగానా పోరాటయోధుల వారసులం బతికే ఉన్నాము.

వీర తెలంగాన పోరాటన్ని ముందుండి నడిపిన్చిన కామ్రేడ్స్, మత రాజకీయాల మొత్తులో తమ గతము మరచి ఉండవచ్చు. నీ మతాని కి ఉన్న ఓటుబాంక్ నేటి రాజకీయ నాయకుల నోరు నొక్క వచ్చు.
కాని, తల్లి తెలంగాణా వొంటి మీద మీ నిజామ్ ముష్కరమూకలు చేసిన గాయలు తాలుకు మచ్చలు పోలేదు. అవి మాకు అడుగడుగునా గతాన్ని గుర్తు చేస్తున్నాయి. కర్తవ్యాన్ని భోదిస్తున్నాయి.పల్లె పల్లె నా మీరు సాగించిన నరమేదము పీడకలలు ఇంకా మమ్ము వెంటాడుతూనే ఉన్నాయి.
ఎంత కండకావరము లేక పోతె నా జాతి స్వర్నోత్సవ వేళ ఇలాంటి ఉన్మత్త ప్రలాపములు చేస్తావు.

అశ్చర్యం.. నిండు సభలో నిజాము రాక్షసుని పొగిడితే నిజం మాట్లాడడానికి వృద్దసింహం చెన్నమనేని తప్ప వేరెవరికి నోరు రాకుండనె. ఎట్టి దుస్తితి వచ్చినది.

Tuesday, November 29, 2005

ఇలాగైతే కోర్టులు ఎందుకు

ఇలాగైతే కోర్టులు ఎందుకు? - గౌరువెంకట రెడ్డి కేసులో సుప్రీం ప్రశ్న
అందుకే కదండి, కోర్టుల తో పని లేకుండా కొవర్టులతో పని జరిపిస్తున్నాము.

Monday, November 28, 2005

రాజకీయనాయకులకి ఇదే మా అహ్వానం.

అదే మా దేశములో ఐతేనా,

MLA ను చంపినవాడు MLA అవుతాడు.
చంపించినవాడు చీఫ్ మినిష్టర్ అవుతాడు.
గడ్డి తిన్నవాడు కేంద్రమంత్రి అవుతాడు.
బక్కరైతుల పొట్టకొట్టినవాడు, సింగపూర్లో మాల్లు, హోటెల్లు కట్టుకుంటాడు.
రాష్ట్ర CEO గా పచ్చపత్రికలచే కీర్తించబడతాడు.

అదే మీ దేశంలో ఐతే,

ముష్టి ఒక మిలియన్ తిన్న పార్టీ అదికారం వదిలేయాలి.
http://www.cnn.com/2005/WORLD/americas/11/28/canada.government/index.html


మూడు మిలియన్లు తిన్న కాంగ్రెస్ సభ్యుడు రాజీనామా చేయ్యాలి, జైలు కి వెల్లాలి.
http://www.cnn.com/2005/POLITICS/11/28/cunningham/index.html

అలసించిన అశాభంగం. తొందరగ మాదెశమ్ కి మఖాము మర్చండి.

Sunday, November 27, 2005

రెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యింది

రెండు నెలలు కాస్తా నాలుగు నెలలు అయ్యింది. ఎట్టకేలకు మళ్ళీ రాయలి అనె బుద్ది పుట్టినది.
ఎంత తొందరగా రోజులు గడిచిపొతున్నాయి! నిన్న కాక మొన్ననే పోస్ట్ చేసినట్లు ఉంది.

సీను బావ పోలీసులకి చిక్కాడు. ఇకనైనా కుట్ర వెనకాల ఉన్న పెద్ద మనుషుల పేర్లు బయటకి వస్తాయంటారా?అయిన మన అమయాకత్వము కాని, ఎప్పుడన్న పెద్ద తలకాయల పేర్లు బయటకి వచ్చాయా?
మన చట్టం ఎప్పుడు ఉన్నవాడి చుట్టమేగా.

Sunday, August 07, 2005

తాత్కాలిక విరామము

పునఃదర్శనం - రెండు నెలల తరువాయి

Wednesday, July 27, 2005

వానా వానా వల్లప్ప

నా చిన్నతనములో, వాన వస్తే పండుగే. అది కూడ ప్రొద్దున ఏడు నుండి పది లోపు మాత్రమేకురిస్తే ఇంకా చాలా పండుగ. ఇక ఆ రోజుకి బడి కి డుమ్మానె. తల తడిస్తే ఎక్కడ జలుబు చేస్తుందో అనుకునే పిచ్చి అమ్మ. చిన్నోడు మనేస్తే మనము కూడ డుమ్మాకొట్టవచ్చు అనుకునే నా బాల్యశత్రువు అన్న.
రెండవ తరగతిలో ఉండగా స్కూల్ బస్ ఉండేడి.వానొచ్చినా, వరదొచ్చినా స్కూలు బస్ ఠంచనుగా ఎనిమిందింటికి తయారు. డ్రైవర్ రాక్షసుడికి తోడు, పిల్లరాక్షసుడు రూపములో హెల్పర్.ఇంటి గుమ్మము దక గొడుగు వెసుకొనివచ్చిమరీ తీసుకుపొయేవాడు.
అప్పటివరకు స్కూల్ కి వద్దులే అనే అమ్మ కూడ, మనోడు గొడుగు వెసుకొని రాగనే చిన్నపిల్లోడు వానా వచ్చింది ఇంటి దగ్గరే ఉండి ఆడుకంటాడు అని లేకుండా, ఆ రాక్షసుల కి ఒప్పచెప్పేది.
కాలము ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మనకి కూడ మంచి రోజులు వచ్చాయి, మా స్కూలు వళ్ళు బుస్ రూటు మర్చారు (లేదా మొత్తానికే తీసివేసారు). ఒక మన చడువు వానాకాలము చదువే. వానపడితే చాలు, పుస్తకాలు ముందు వేసుకొని పక్కింటోడి (మరి మన శత్రువులు కొంతమన్ది ఉండేది అక్కడే కద) టాపు ఎగిరిపొయెటట్టు ఎదో ఒకటి చదవడమ్. అమ్మేమో పెద్దోడా నూవు ఒక్కడివే వెల్లులే, చిన్నోడు ఇంటి డగ్గర చడువుకొంటాడు అనడమ్.పెద్దోడెమొ ఎందుకులే అమ్మా బడి మానిపించడము, నేను గొడుగులో తడవకుండా తీసుకువెల్తాగ అనడమ్, ఒకదాని తరువాఅత ఒకటి అలా జరిగిపోతుఉండేవి. పెద్దపూలికేమో ఇవేవి పట్టేవి కావు. ఎదో ఒక గొడవా, పంచాయితి. మద్యలో మనతో మాట్లాడడానికి ఒక నిమిషము దొరికిందా అదృష్టవంతులము. ఆయనకి ఏటూ చదువుల మీద పెద్ద పట్టింపు లేదు కాబట్టి, "నాన్న గారు వాన" అని మనము అనడం ఆలశ్యము, అమ్మాయి అంటు కేక వేసి అమ్మ కి అర్డర్ "వాన పడుతుంది, చిన్నవాడికి స్కూలు ఉండదులే". ఇక దానికి తిరుగులేదు.
మరు నిమిషములో ఎండ వచ్చినా, పెద్దపులిని కాదనే దైర్యము ఎవరికి ఉంది. అప్పటికి ఇంకా మా ఇంట్లో ప్రజాస్వామ్యపు వాసనలు లేవు, నియంతృత్వమే.

దేనేవాలా జభ్భి దేత, దేత చప్పర్ ఫాడ్కె

దేనేవాలా జభ్భి దేత, దేత చప్పర్ ఫాడ్కె
ఎంత నిజం.
మొన్నటి దాక తాగటానికి మంచినీళ్ళు దొరకని పరిస్థితి. నేడెమో ఎటు చూసినా జలరాసులు.

వాన అంటేనే వేడి వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తులు, వేడి వేడి మిరపకాయ బజ్జీలు గుర్తుకు వస్తున్నాయి.
చీ...ఇదెమిటి అక్కడ అంతమంది వరుణుని ప్రతాపానికి నిలువ నీడ లేకుండా అల్లల్లాడుతూ ఉంటే నేను "మొక్క జొన్న పొత్తులు, వేడి వేడి మిరపకాయ బజ్జీలు" అంటు ఆలోచిస్తున్నాను.

Tuesday, July 26, 2005

భారతదేశములో బానిసత్వము

చాలా చోట్ల చదివాను, ప్రపంచము లో అన్ని చోట్ల బానిసత్వము ఏదో ఒకరూపమ్ లొ ఉండింది కాని, ఒక్క భారతదేశములోనే అసలు ఎప్పుడూ లేదు అని.
కానీ అలోచిస్తే, హరిశ్చంద్రుడు కాటికాపరి అయినది బానిసగ అమ్ముడుపోయకనే కద.
సత్యయుగము వరకు ఎందుకు, కలియుగములో కూడా మొన్నటి వరకు చాలా ప్రాంతములలో వెట్టి ఉన్నది కదా? వెట్టి - బానిసత్వము కు మరో పేరు మాత్రమే అనవచ్చును కదా?
కానీ మన దేశములో బానిసత్వానికి ఇతర దేశములలో బానిసత్వముకు తేడా, ప్రపంచములో ఎక్కడా స్వజాతి జనులను బానిసలుగా చెసుకోలేదు మనము తప్ప.

ఇది అబద్దము అని చెప్పె reference దొరికితే బాగుండును.

అప్పుడు మనము నిజముగానే సగర్వముగ తల ఎత్తికొని ప్రపంచానికి చాట వచ్చు, "మా గడ్డ మీద బానిసలు ఎప్పుడు లేరు" అని.

hair oil



బాబుగారు వాడె తలనూనె ఏమిటో? జుట్టు నిగనిగలాడిపొతుంది.

నాన్నా పులి !!

మా తెలుగు టీచర్ గారి ఙాపకార్దము మనకు అలవాటు లేని తెలుగులో try చేసాకానీ ఇక అలా రాయడము కష్టము అని అర్దము అవుతుంది. అందుకని మనకు అలవాటు ఐన వ్యవహారిక భాష లొ కి వచ్చేస్తా.

ఇవాల రేపు పత్రికలు చదువుతుంటే, నాన్నా పులి !! కథ గుర్తుకువస్తుంది.
ఏది నిజమైన వార్త నో ఏది అల్లిన వార్తనో తెలియడం లేదు.
ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలి అనే ఏకైక సూత్రం తొ పని చేస్తూ తామె గబ్బు పట్టిపోతున్నారు. అతి చేస్తె గతి చెడుతుంది అన్న చిన్న విషయము తెలియని వారైతే కాదు కద.తప్పుడు వార్తలతో, అవకాశవాద ఉద్యమాలతో ప్రభుత్వాలు మార్చిన చరిత్ర వీరి కుండవచ్చు గాక. కాని ఉన్నదానికి లేనిదానికి "నాన్నా పులి !" అంటె ఎమౌతుంది?

Monday, July 25, 2005

రచ్చబండ

నా మొదటి పోస్ట్ ఇవ్వాలే రచ్చబండకి పంపాను.
నా చిన్నప్పటి సందెహమైన, మహాభారత కాలము లొ ఉన్నది మతృస్వామ్యమా లేక పితృస్వామ్యమా అను ప్రశ్న పెద్దలముందుంచితిని.
పెద్దలకు కాలహరణము అగునని నెమ్మదించుచున్నాను కాని లేని యెడల ఇటువంటి సందేహములు మనకు బహుమెండుగా ఉన్నవి.

పొరుగువాని గొప్పతనము

లండను లో ఐనా, కాశ్మీరములో ఐనా , ఈజిప్టు లొ ఐనా మన పొరుగింటివారు లేకుండా పని జరుగదు కదండీ.


http://dailypioneer.com/indexn12.asp?main_variable=front%5Fpage&file_name=story5%2Etxt&counter_img=5

Sharm blasts: Egypt looking for 6 Pakistanis
Agencies/ Sharm el-Sheikh
In an interesting twist to investigations into the serial terror bombings at Sharm el-Sheikh last Saturday, Egyptian police said on Monday they are searching for six Pakistani nationals in connection with the blasts.