Sunday, December 04, 2005

లాల్ సలామ్ చెన్నమనేని గారు...

స్వర్ణోత్సవ వేల నిజామ్ రాక్షసుని పొగడ్తా ??? సిగ్గు సిగ్గు

ఒవైసీ... చరిత్ర కి నీ సొంత భాష్యాలు చెప్పకు.ఇంకా తెలంగాణా పోరాట యోధులు బతికే ఉన్నారు . తెలంగానా పోరాటయోధుల వారసులం బతికే ఉన్నాము.

వీర తెలంగాన పోరాటన్ని ముందుండి నడిపిన్చిన కామ్రేడ్స్, మత రాజకీయాల మొత్తులో తమ గతము మరచి ఉండవచ్చు. నీ మతాని కి ఉన్న ఓటుబాంక్ నేటి రాజకీయ నాయకుల నోరు నొక్క వచ్చు.
కాని, తల్లి తెలంగాణా వొంటి మీద మీ నిజామ్ ముష్కరమూకలు చేసిన గాయలు తాలుకు మచ్చలు పోలేదు. అవి మాకు అడుగడుగునా గతాన్ని గుర్తు చేస్తున్నాయి. కర్తవ్యాన్ని భోదిస్తున్నాయి.పల్లె పల్లె నా మీరు సాగించిన నరమేదము పీడకలలు ఇంకా మమ్ము వెంటాడుతూనే ఉన్నాయి.
ఎంత కండకావరము లేక పోతె నా జాతి స్వర్నోత్సవ వేళ ఇలాంటి ఉన్మత్త ప్రలాపములు చేస్తావు.

అశ్చర్యం.. నిండు సభలో నిజాము రాక్షసుని పొగిడితే నిజం మాట్లాడడానికి వృద్దసింహం చెన్నమనేని తప్ప వేరెవరికి నోరు రాకుండనె. ఎట్టి దుస్తితి వచ్చినది.

1 comment:

oremuna said...

__dito__
aMdukE manaku vidhaana saba uMDaali
aMdulO ayitE daaSarathi vaMTi vaaLLu okaru iddaru ayinaa uMTaaru.