మొన్న ఎవరో చిన్నపిల్లవాడు అంటున్నాడు, తన మాతృదేశం(ఆమెరికా)నా మాతృదేశం(భారతదేశం) కంటే గొప్పది అని.ఎందుకుర అబ్బాయి అంటే, అతను చెప్పిన సమాదానం - వలసదారులు ఎక్కువ మంది వచ్చే దేశం మాదే కదా అని. ఐతే అని అర్ధం కానట్లు అదిగితే, జాలి గా ఒకసారి నా వంక చూసి, అందర్ని వదులుకొని మా దేశంకి ఇంత మంది వస్తున్నారు అంటె ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అనే కదా, బయటి వాళ్ళకి ఇంత మందికి అవకాశం ఇస్తున్న మాదేశమె కదా మామా గొప్పది అన్నాడు.
మాకు తరతరాలా తరగని చరిత్ర ఉంది అంటూ ఏదో అప్పటికి వాడి నోరు మూయించినా, ఈరోజు చిన్న థాక్రేగారి ప్రకటనలు, వారి అనుచరుల వీరంగం చూసాక అర్దం అయ్యింది చిన్నొడు చెప్పిన మాటల్లొ ఎంత నిజం ఉందో.
Tuesday, February 05, 2008
Subscribe to:
Posts (Atom)