నాకు కాదు. మన సోదరులు కొంతమందికి. బెంచ్ మీద ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళని వదిలించుకోవడానికి మన సాఫ్ట్-వేర్ కంపనీలు కనిపెట్టిన కొత్త ఉపాయం.
ఇంకోటి, ఎప్పుడో క్లయిమ్ చేసుకున్న బిల్లులని మళ్ళీ తనిఖీ చెయ్యడం. ఇలా జరుగుతుంది అని చెప్పిన నా మిత్రుని కి నా సలహా, నీ రెస్యుమే లో ఎక్స్పీరీయన్స్ ని మార్చి క్లయింట్స్ కి పంపి ఉంటారు కదా, అవి అన్నీ పేపర్ వాళ్ళకి చెబుతా అని దమ్కీ ఇవ్వు. దెబ్బకి దయ్యం వదులుతుంది.
అయ్యా సాఫ్ట్-వేర్ కంపెనీ అదినేతలారా, పని లేదు అని ఇంత మంది ఉద్యోగస్తులని వెళ్ళగొడుతున్నారు కదా, మరి ఆ ఉద్యోగాలు చూపించి కొట్టేసిన స్తలాలు కూడ వెనక్కి ఇచ్చేస్తారా?
Monday, November 24, 2008
సహజ మిత్రులు
ఈ రోజు బాబుగారి ప్రకటన, కా.పా.ఐ తో పొత్తు ప్రకటన చేస్తూ.
ఆ బగవంతుడు మనకి మతిమరుపు ని వరంగా ఇచ్చి బతికించాడు కాని, లేదు అంటే రాష్రాదికారం చేతికి చిక్కాక, బాబు గారు చేసిన పనులు మనకి గుర్తు ఉంటే ఏమి కాను.
కమ్యునిజానికి కాలం చెల్లింది అన్నారు. ఒక్క కమ్యూనిజం ఏమిటీ, అన్ని యిజాలకి కాలం చెల్లింది అన్నారు, ఒక్క టూరిజం తప్ప. (అది నిజమే కామోసు అనుకొని, ఆంద్రా ప్రజలు బాబు గారిని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు, పర్యటనలు చేస్తూ, టూరిజం ని అభివృద్ది చెయ్యమని. అది వేరే విషయం)
అస్సెంబ్లీ లో ప్రతినిదులు లేరు అనే కారణం చూపించి, కా.పా.ఐ ని అఖిలపక్ష సమావేశాలకి పిలవడం ఆపేసారు.
కాల్దరిలో కానీయ్యండి, బషీర్ బాగ్ లో కానీయ్యండి, ఆందోళన చేస్తున్న వారితో చర్చల కంటే, కర్రలకీ, కాల్పులకే పని చెప్పారు.
ప్రపంచ బాంక్ జీతం తీసుకునే వారికంటే ఎక్కువగా వారి సిద్దాంతాలని ప్రవచించారు. (క్షమించాలి, మీకు ఏ సిద్దాంత రాద్దాంతాలు లేవు అని తెలిసినా, ప్రపంచ బాంకు వారు - వారికేవో సిద్దాంతాలు ఉన్నాయి అని చెప్పుకుంటారు కాబట్టి అలా రాయాల్సి వచ్చింది.)

గుద్దు - ముద్దు
అక్కడ పులివెందుల లో గడ్డం పట్టుకొని(గిట్టని వాళ్ళు అది చెంపదెబ్బా అన్నారు, కానీ శాంతిదూత భూమానాగిరెడ్డి గారు అక్కడ ఉండగ ప్ర.రా.పా. వాళ్ళు రౌడియిజం ఎందుకు చేస్తారు? మనం కూడా కొంచెం అలోచించాలి), మీ ఇంటి మీద జెండా కర్ర కట్టుకుంటాము, అంటే పిడిగుద్దులు గుద్దారు.
ఇప్పుడేమో వేదికలెక్కి ముద్దులు ఇచ్చేస్తున్నారు, అడిగిన వారికి, అడగని వారికి.

Friday, November 21, 2008
రాక్షసానందం
చిరంజీవిగారు పులివెందుల వెళ్ళి తొడ కొడితే అదో ఆనందం.
సాక్షిలో రామోజీ పుత్రరత్నం తన హితుడు, సన్నిహితుడు...ఇంకా చాలనే అని వాళ్ళే చెప్పుకున్న అతనితో కలిసి తన తండ్రి కి వ్యతిరేకంగా ఇంటర్వ్యూ ఇస్తే పరమానందం.
ఎందెందు వెదికినా అందందే కలడే మన చిన్న బాసు అంటు జంట పత్రికలలో రోజు వచ్చే వార్తలు చదివితే అదో రకమైన మహదానందం.
నందమూరి అందగాళ్ళ మద్య నలిగిన నారా బాబు అనే వార్త చూస్తే అదో శునకానందం.
ఏమిటో మనవాళ్ళు చేసిన చంద్రయానం కంటే, ఇవ్వాళా రేపు ఇలాంటి వార్తలకే గిరాకీ. అవి చదివితేనే మన జనాలకు ఆనందం, దీన్ని మాములు ఆనందం కాదు, రాక్షసానందం అనాలి ఏమో.

Thursday, November 20, 2008
సాక్షి రామాయణం
రామోజీ రావు గారికి ఎందుకో మనమీద కోపంగా ఉన్నట్లు ఉంది. లేదు అంటే రాత, కోత, కూత, గీత అన్నీ వొంటి చేత్తో చేసే సుమన్ లాంటి యోగ్యుడైన కొడుకుని దూరం చేసుకుంటారా. దేముని దయవల్ల ఇంత మంది నటులు రోడ్ల మీదకి వచ్చారు కాని, లేకపోతె ఆంద్రరాష్ట్రం అల్లకల్లోలం అయిపొయి ఉండేది కదా తమ ఆరాద్యనటుడు బుల్లితెర మీద కనపడకపోయే సరికి.
వెటకారం పక్కన పెడితే, ఏదొ చిన్న పిల్లల కు ఆటబొమ్మ ఇచ్చినట్లు, రామోజీగారు ఈ.టి.వి. ని సుమన్ కి ఇచ్చారు, నా జోలికి రాకుండా దాన్ని పెట్టుకొని ఆడుకో పో అని. కోతి కి కొబ్బరి కాయ దొరికినట్లు, చానల్ తమ చేతిలో ఉండే సరికి, తమ వెటకారపు రాతలతో, వికృత చేష్టలతో జనాలతో ఆడుకున్నారు ఈ మిత్రద్వయం.
సుమన్ ఆరోగ్యం సరిగా లేదు అనే ఒక్క కారణం తో ఇక్కడి తో ముగిస్తా.
చివరిగా ఒక ప్రశ్న - రామోజీ అనే మర్రిచెట్టు లేక పోతే, సుమన్ అనే మహా కళాకారుడుఎక్కడ ఉండేవాడు?

Monday, November 03, 2008
నలుగురు నవ్వి పోదురుగాక
ఏమయ్య రాదాక్రిష్ణగారు, రచ్చబండ మీద పోసుపోక చేసుకునే చర్చల స్తాయికి పత్రికని దిగ్విజయంగా దిగజారుస్తున్నారు కదా? సి.సి.రెడ్డిగారు ఏమన్నా అమర్త్యాసేనా అండీ? ఆయన పత్రికలో రాసుకున్నదాన్ని, డబ్బాకట్టి వెయ్యడానికి?
పోని మీరు ఉచితాపదకాలకి వ్యతిరేకమా? అలా అనుకుంటే, అన్ని పక్షాలు ఉచిత మంత్రాన్నే నమ్ముకున్నాయి కదా? అన్నిటినీ ఏకి పారేయాలి కదా ? ఒక్క కాంగీయుల మీద ఈ వల్లమాలిన అభిమానం ఏల? మీ ఈ మతి మాలిన అతి చేష్టల వల్ల కదూ, అన్ని తప్పులు చేసిన అదికారపక్షం ఇంకా దబాయించగలుగుతుంది?

నినాదం ఏమిటీ?
రాభొయ్యె ఎన్నికలలో పాలక/ప్రతిపక్షాల నినాదం ఏమిటి?
అవినీతి??
వారసత్వ రాజకీయాలు??
ఆశ్రితపక్షపాతము?
చిరంజీవిగారి కంటే ఇంకా అవినీతి మట్టి అంటలేదు కాని, కాంగ్రెస్స్, తె.దే.పా ల లొ పుష్కలం కదా :)
వారసత్వ రాజకీయాలు, ఆశ్రితపక్షపాతము గురించి ఎంత తక్కువ మట్లాడితే అంత మంచిది ఏమో. అందరు ఆ తానులో ముక్కలే. రాజకీయాపక్షాలు సరే, మరి సగటు మనిషి ప్రాదాన్యత దేనికో?

ఇది అన్యాయం ఉండవల్లిగారు!
రెండు ఎకరాల రైతు కొడుకు అని అంతా తనని అంటుంటే తన కొడుక్కి అటువంటి పరిస్తితి రాకూడదు అని, ఎదో నాలుగు ఎకరాలు కూడబెడితే మీరు ఇలా పత్రికలకి ఎక్కడం ఏమీ పద్దతిగా లేదు. పోనీ ఏదన్న వారం, వర్జ్యం చూసుకువచ్చారా అంటే, శుభమా అని యువ గర్జన పెట్టుకున్న రోజే ఇంత పని చేస్తారా? తన మార్గదర్శిని సలహా అడుగుదామ అంటే, తనకే దిక్కుతోచని పరిస్తితి ఇంతకు ముందు మీరు కొట్టిన దెబ్బ వల్ల.
ఎవరి పుట్టె మునగనుందో
త్రిముఖ పోటి మన రాష్ట్రానికి కొత్త. కొన్ని నెలలో జరగనున్న ఎన్నికలలో, సగటు ఆంద్రుని ఓటు ఎవరికో, తలపోటు ఎవరికో?
విజేతలు, పరాజితులు ఎవరైనా, నాలాంటి రాజకీయాసక్తి ఉన్న సగటు జీవి కి మాత్రము కడుపునిండా విందు భోజనం,

Tuesday, February 05, 2008
ఏ దేశం గొప్ప
మొన్న ఎవరో చిన్నపిల్లవాడు అంటున్నాడు, తన మాతృదేశం(ఆమెరికా)నా మాతృదేశం(భారతదేశం) కంటే గొప్పది అని.ఎందుకుర అబ్బాయి అంటే, అతను చెప్పిన సమాదానం - వలసదారులు ఎక్కువ మంది వచ్చే దేశం మాదే కదా అని. ఐతే అని అర్ధం కానట్లు అదిగితే, జాలి గా ఒకసారి నా వంక చూసి, అందర్ని వదులుకొని మా దేశంకి ఇంత మంది వస్తున్నారు అంటె ఇక్కడ అవకాశాలు ఉన్నాయి అనే కదా, బయటి వాళ్ళకి ఇంత మందికి అవకాశం ఇస్తున్న మాదేశమె కదా మామా గొప్పది అన్నాడు.
మాకు తరతరాలా తరగని చరిత్ర ఉంది అంటూ ఏదో అప్పటికి వాడి నోరు మూయించినా, ఈరోజు చిన్న థాక్రేగారి ప్రకటనలు, వారి అనుచరుల వీరంగం చూసాక అర్దం అయ్యింది చిన్నొడు చెప్పిన మాటల్లొ ఎంత నిజం ఉందో.

Friday, July 07, 2006
కదంబం
బధ్ఢకం, బధ్ఢకం...బండలా పెరిగి పోయింది. ఆరు నెల్ల తరువాత మోక్షం కింధ పోస్ట్ కి
చాలా రోజులు అయ్యింది "నా గోల" కి వచ్చి...
భొజనప్రియులము కదా, మొదట తిండి గొడవ:
పప్పు దాన్యల ధరలు భారతదేశములో అదుపు చెయ్యడము ఏమో కాని ఇక్కడ అమెరికాలో మాత్రము వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పోని అంత ధర పెట్టి కావలసినన్ని కొనుక్కోవచ్చా అంటీ, ప్రాంతాన్ని బట్టి రకాని కి ఒకటి లేదా రెండు పొట్లాలు మాత్రమే కొనాలి అంటా. అదేమిటండీ అంటే, ఏమి చేస్తాము భారత ప్రభుత్వము పప్పుల ఎగుమతులు నిషేదించింది అంటు ఒక వంకర నవ్వు నవ్వి పోయాడు, కొట్టు పెట్టుకున్న గుజరాతి పటేల్ గారు.
ఇక్కడ పెరిగితే పెరిగాయి కానీ, మన దేశములో కనుక దరలు తగ్గితె అదె పదివేలు.
"లోక్ సత్తా" సత్తా చాటుకోగలుగుతుందా? ఏమో మరి, NTR పార్టీ పెట్టినప్పుడు కూడ ఇలానే అనుకున్నారు కదా, సంవత్సరంలోపె ఇండిరమ్మ పార్టీనిఓడించలేదు. మల్లి అటువంటి అద్భుతమే జరగొచ్చెమొ ముడెల్ల తరువాత, ఎవరు చెప్పొచ్చారు.

Wednesday, March 29, 2006
కదంబం
కింద పోస్ట్ అయితే 10 నెల్లు ఉంది క్యూ లో :)
ఎవడికి పుట్టిన బిడ్డరా..!!
అన్నట్లు ఉంది పోలవరం ముంపు బాదితుల గోడు ఐనా, గంగవరం పోర్టు బాదితుల గోడు ఐనా.తరతరాలు గా అడవిని, సముద్రాన్ని నమ్ముకున్నవారిని ఒక్కసారిగా నాగరిక ప్రపంచంలో బతకమంటే వారి తరమౌతుందా?ఇన్ని చట్టాలు, శాసనాలు ఉండి కూడా వాళ్ళ హక్కులు కాపాడలెనప్పుడు, నాగరిక ప్రపంచములో వాళ్ళ జీవనానికి హామీ ఎవ్వరు?
సోనియమ్మా త్యాగమంటే మీదెనమ్మా...
ఆదెమిటో చిన్నప్పుడు చదువుకున్న కథలో నక్క "అందని ద్రాక్షా పుల్లన" అనుకుంది కానీ, మీలా త్యాగం చెయ్యలేక పోయ్యింది.
ఇంతకీ తేనె తుట్టె ని కదిపింది మీపార్టీవారె కదా, మరి ప్రతిపక్షాల మీద ఆగ్రహం యేల.
హమ్మయ్యా శాసనసభ సమావేశాలు ముగిసాయి.

Subscribe to:
Posts (Atom)